జనసేనతో పొత్తులు లేవు
ఒంటరి పోరుకే సిద్ధం సొంతంగా ఎదగడమే లక్ష్యం బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్‌రావు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: రాబోయే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేనతో సహా ఏ ఇతర రాజకీయ పార్టీతోనూ బీజేపీకి పొత్తులు ఉండబోవని, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమైన అనంతరం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు...