ఒక్కరోజు గైర్హాజరుకే వివరణ కోరడం సరికాదు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): శాంతిఖని గనిలో ఒక్కరోజు గైర్హాజరైన కార్మికుడు నాగాకు వివరణ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం లేఖ జారీ చేయడం సరికాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, సింగరేణిలోని ఇతర ఏ గనిలోనూ లేని విధంగా శాంతిఖని గనిలో మాత్రమే వివరణ కోరుతూ లేఖ ఇవ్వడం సమంజసం కాదన్నారు. అనివార్య కారణాల వల్ల ఒక్కరోజు విధులకు హాజరుకాలేకపోతే కార్మికుడిని వివరణ కోరడం సరైన విధానం కాదని, ఈ నిర్ణయంపై...