ఆ రాష్ట్రంలో ఆగని ఒకే ఒక్క రైలు ఏమిటో తెలుసా ?

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంటారు. భారతీయ రైల్వేలో వందలాది రైళ్లు నడుస్తున్నప్పటికీ, ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్లు 12820/12819) ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ రైలు బీహార్ రాష్ట్రంలోని 70కి పైగా రైల్వే స్టేషన్లను దాటినా ఒక్క స్టేషన్‌లో కూడా ఆగదు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి భువనేశ్వర్ వరకు నడిచే ఈ రైలు (12820), తిరుగు ప్రయాణంలో...