బీబీపేటలో తల్లిపాల వారోత్సవాలు

ముర్రుపాలు శిశువుకు తొలి టీకా లాంటివే తల్లులకు అవగాహన కల్పించిన అంగన్‌వాడీ సిబ్బంది కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ శ్వేత తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రసవం జరిగిన గంటలోపు శిశువుకు ముర్రుపాలు (కొలస్ట్రం) తాగించడం ఎంతో అవసరమని తెలిపారు. ముర్రుపాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉండటంతో పాటు, అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించే రోగనిరోధక శక్తి లభిస్తుందని వివరించారు....