సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు

ఫాగింగ్, పారిశుద్ధ్య పనులు ముమ్మరం దోమల నివారణలో ప్రజలూ భాగస్వాములు కావాలి మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు పిలుపు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మందమర్రి మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు తెలిపారు. గురువారం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 5, 23వ వార్డుల్లో నిర్వహించిన ఫాగింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త తొలగింపు పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో దోమల ద్వారా...