రేపు బీబీపేటలో మెగా రక్తదాన శిబిరం

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు రేపు (ఆగస్టు 7) ఉదయం 9 గంటలకు బీబీపేటలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాసవి క్లబ్ బీబీపేట, శ్రీ మణికంఠ భారత గ్యాస్ (దోమకొండ) సంయుక్త ఆధ్వర్యంలో, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరం రక్తం అవసరమవుతుందని, ఈ నేపథ్యంలో యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం...