CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 7:19 pm Posted By: coalbelt 24 News

రేపు బీబీపేటలో మెగా రక్తదాన శిబిరం

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు రేపు (ఆగస్టు 7) ఉదయం 9 గంటలకు బీబీపేటలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాసవి క్లబ్ బీబీపేట, శ్రీ మణికంఠ భారత గ్యాస్ (దోమకొండ) సంయుక్త ఆధ్వర్యంలో, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరం రక్తం అవసరమవుతుందని, ఈ నేపథ్యంలో యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి మానవతా సేవలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శిబిరంలో పాల్గొనే ప్రతి రక్తదాతకు ప్రశంసా పత్రంతో పాటు ఒక కీ చైన్‌ను అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీ మణికంఠ భారత గ్యాస్ తరఫున ప్రతి రక్తదాతకు ఒక వాటర్ బాటిల్‌ను బహుమతిగా అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేయాలని వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, శ్రీ మణికంఠ భారత గ్యాస్ నిర్వాహకుడు బాశెట్టి నాగేశ్వర్, కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు నీల బాలచంద్రం విజ్ఞప్తి చేశారు.

 

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});