ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి

మందమర్రి ఏరియాలో జయశంకర్ జయంతి వేడుకలు నివాళులర్పించిన అధికారులు, ఉద్యోగులు మందమర్రి జీఎం ఎన్. రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): దివంగత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు అందించే నిజమైన ఘన నివాళి అని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అన్నారు. గురువారం మందమర్రి ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో తెలంగాణ సిద్ధాంతకర్త, కీర్తిశేషులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన...