బీబీపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం రాత్రి గస్తీ బలోపేతంపై అధికారులకు ఆదేశాలు కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ రావు, కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా డీఎస్పీ ఎస్. మధుసూదన్ రావు, సీఐ జె. నరేష్‌తో కలిసి గురువారం బీబీపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, స్టేషన్ నిర్వహణ, మౌలిక వసతులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై...