CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 7:28 pm Posted By: coalbelt 24 News

బీబీపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం,
ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం
రాత్రి గస్తీ బలోపేతంపై అధికారులకు ఆదేశాలు
కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ రావు,

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కామారెడ్డి జిల్లా డీఎస్పీ ఎస్. మధుసూదన్ రావు, సీఐ జె. నరేష్‌తో కలిసి గురువారం బీబీపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, స్టేషన్ నిర్వహణ, మౌలిక వసతులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును వెంటనే స్వీకరించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు.

పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని, రాత్రి గస్తీని మరింత పటిష్ఠంగా నిర్వహించాలని సూచించారు. అలాగే గ్రామాల్లో ప్రజలతో సమన్వయాన్ని పెంపొందించి, పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. డిఎస్పీ తో పాటు సీఐ జె. నరేష్, బీబీపేట పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});