CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 10:06 pm Posted By: coalbelt 24 News

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా పోరు యాత్ర

మందమర్రిలో అబ్రహం స్తూపం వద్ద ప్రారంభం
సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’
సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రజల్లో ప్రజా సమస్యలపై చైతన్యం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పోరు యాత్ర చేపట్టినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు. గురువారం మందమర్రి పట్టణంలోని అబ్రహం స్తూపం వద్ద యాత్రను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలు, పట్టణాల్లో ప్రజలు, కార్మికులను చైతన్యపరిచే లక్ష్యంతో ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విద్య, వైద్యం, రహదారులు తదితర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణాల్లో ఈ ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే ‘చలో ఢిల్లీ’ ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ నాయకులు కామ్రేడ్ అబ్రహం స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి మిట్టపల్లి పౌలు, పార్టీ మండల కార్యదర్శి వనం సత్యం, మందమర్రి పట్టణ కార్యదర్శి కామెరా దుర్గారాజు, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లింగయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});