తెలంగాణ ఆత్మగౌరవానికి సైద్ధాంతిక బలం ఆచార్య జయశంకర్

మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఉద్యోగులకు పిలుపు మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగం పేర్కొన్నారు. గురువారం మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా...