మందమర్రిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

వర్షాకాలానికి ముందస్తు సన్నద్ధత చెట్ల పొదలు తొలగింపు తాత్కాలిక మురుగు కాలువల ఏర్పాటు మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ప్రత్యక్ష పర్యవేక్షణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): వర్షాకాలాన్ని నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు స్వయంగా పర్యవేక్షిస్తూ పలు ప్రాంతాల్లో పరిశుభ్రత పనులను వేగవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మందమర్రి ప్రధాన రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి తుమ్మ చెట్లను జేసీబీ సహాయంతో తొలగించి,...