వర్షాకాలానికి ముందస్తు సన్నద్ధత
చెట్ల పొదలు తొలగింపు
తాత్కాలిక మురుగు కాలువల ఏర్పాటు
మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ప్రత్యక్ష పర్యవేక్షణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వర్షాకాలాన్ని నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు స్వయంగా పర్యవేక్షిస్తూ పలు ప్రాంతాల్లో పరిశుభ్రత పనులను వేగవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మందమర్రి ప్రధాన రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి తుమ్మ చెట్లను జేసీబీ సహాయంతో తొలగించి, రహదారిని పరిశుభ్రంగా మార్చి వాహనాల రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. అలాగే ఊరు మందమర్రి వెళ్లే రహదారి వెంట ఉన్న పిచ్చి చెట్లను కూడా తొలగించి ప్రజలు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగా ఏర్పడిన లక్ష్మీ భవాని కాలనీలో శాశ్వత మురుగు కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తాత్కాలికంగా జేసీబీతో కాలువలను తవ్వించి, వర్షపు నీరు సులభంగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఈ. వసంత్, బిల్ కలెక్టర్ బుర్ల లింగయ్య, ఇన్‌చార్జి జవాన్ మేకల నరేష్, మున్సిపాలిటీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});