ఆగస్టు 6, 7 తేదీల్లో ప్రదర్శనలు
డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సింగరేణి ఆధ్వర్యంలో మందమర్రి సీఈఆర్ క్లబ్‌లో ఈనెల 6, 7 తేదీల్లో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు మందమర్రి ఏరియా డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటలకు నాటకాలు ప్రదర్శించబడతాయని తెలిపారు. సామాజిక సంస్కర్తలు, మహనీయుల జీవితాలు, ఆశయాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆగస్టు 6న భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం, ఆశయాలు, లక్ష్యాల ఆధారంగా రూపొందించిన “సంఘం శరణం గచ్ఛామి” నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఆగస్టు 7న మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవితాలు, ఆశయాలు, లక్ష్యాలను ప్రతిబింబించే “సత్య శోధన” నాటకాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు మందమర్రి పట్టణ ప్రజలు, సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీజీఎం సీహెచ్. అశోక్ విజ్ఞప్తి చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});