హుండీ ఆదాయం ₹4.31 కోట్లు
సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి సంబంధించిన గణాంకాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)విడుదల చేసింది.
టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 78,561 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 33,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ద్వారా రూ.4.31 కోట్ల ఆదాయం సమకూరగా, భక్తులకు 3.85 లక్షల లడ్డూలు విక్రయించినట్లు తెలిపింది.
2.06 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించగా, అశ్విని ఆసుపత్రిలో 2,689 మంది భక్తులకు వైద్య సేవలు అందించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో సర్వదర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ సమయం ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది.
భక్తులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకుని, టీటీడీ సూచనలు పాటిస్తూ దర్శనానికి రావాలని అధికారులు సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});