22 ఏళ్ల తర్వాత ఇస్సానగర్‌లో ఊరడమ్మ పండుగ
గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా అంగరంగ వైభవంగా వేడుకలు గ్రామ శ్రేయస్సు కోసం అమ్మవారికి ప్రత్యేక మొక్కులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): ఇస్సానగర్ గ్రామంలో గ్రామదేవత ఊరడమ్మ పండుగను 22 ఏళ్ల అనంతరం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని చిన్నా, పెద్దా, మహిళలు, పురుషులు, వృద్ధులు అనే తేడా లేకుండా వేలాదిగా హాజరై భక్తిశ్రద్ధలతో పండుగలో పాల్గొన్నారు. రెండు దశాబ్దాలకుపైగా ఇలాంటి ఉత్సవాన్ని చూడని గ్రామస్తులు ఉత్సాహంగా వేడుకలను జరుపుకోవడంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తుల ఐక్యత, సామరస్యం...