బంగారం ధరల్లో భారీ తగ్గుదల
వెండి ధరలో స్వల్ప పెరుగుదల
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,080
కిలో వెండి ధర రూ.2,24,914
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చేలా పసిడి ధరలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.420 తగ్గి రూ.1,47,080కు చేరుకుంది. బంగారు ఆభరణాల తయారీలో విస్తృతంగా వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా హైదరాబాద్లో 10 గ్రాములకు రూ.1,32,190గా నమోదైంది.
ఇదిలా ఉండగా, వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. మంగళవారం నాటికి హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.243 పెరిగి రూ.2,24,914కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులు, డాలర్ మారకపు విలువ, దేశీయ డిమాండ్ వంటి అంశాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});