మణుగూరు ఓసీపీ సింగరేణికి కేటాయింపు కార్మికుల విజయమే: ఏఐటీయూసీ
మందమర్రి ఏరియాలో కార్మికులకు ఉచిత అల్పాహారం, తేనేటి విందు గనులు, డిపార్టుమెంట్ల వద్ద కార్మికులతో ఏఐటీయూసీ సంబరాలు పోరాట ఫలితాన్ని తమ ఖాతాలో వేసుకోవద్దని ఇతర సంఘాలకు హితవు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మణుగూరు డీప్ సైడ్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ)ను సింగరేణి కాలరీస్‌కు కేటాయించిన సందర్భంగా మందమర్రి ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం కార్మికులకు ఉచిత అల్పాహారం, తేనేటి విందు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందమర్రి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్...