ఆగస్టు 10న మందమర్రి లో ‘జైల్ భరో’….

ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10వ తేదీన మందమర్రి పట్టణంలో నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మందమర్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా...