కేటీఆర్ వ్యాఖ్యల శైలి బీఆర్ఎస్‌కే భారమవుతోందా?

ప్రజా సమస్యల కంటే వివాదాస్పద వ్యాఖ్యలకే ప్రాధాన్యం.. కేటీఆర్ మాటలతో రాజకీయ మైలేజ్ పెరుగుతుందా ? సంయమనంతో విమర్శలు చేస్తే మంచిదా ? కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) వ్యాఖ్యల శైలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై విమర్శలు చేయడంలో రాజకీయ ఆధారాలు, వాస్తవాలపై దృష్టి...