CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 4:00 pm Posted By: coalbelt 24 News

ఈ ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు

సెప్టెంబరు 15–23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
అక్టోబరు 12–20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
అధిక మాసమే ప్రధాన కారణం
ఏర్పాట్లు ప్రారంభించిన టీటీడీ

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రెండు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటు, అధికమాసం కారణంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా వైభవంగా నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వివిధ వాహన సేవలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో, దర్శనం, వసతి, రవాణా, భద్రత, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు టీటీడీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});