జులై 2న తిరుమలకు 66,304 మంది భక్తులు

హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు 31,811 మంది తలనీలాలు సమర్పణ సర్వదర్శనానికి 12 గంటల నిరీక్షణ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం మొత్తం 66,304 మంది భక్తులు దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ కొనసాగడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కళకళలాడాయి. భక్తులు శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.51 కోట్ల కానుకలు సమర్పించారు. అలాగే 31,811 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇదే...