కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటమే మార్గం
మంచిర్యాలలో ఏఐటీయూసీ 4వ జిల్లా మహాసభ కనీస వేతనం రూ.26 వేల అమలు ప్రైవేటీకరణ నిలిపివేతపై తీర్మానాలు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): భారతదేశంలో సుమారు 54 కోట్ల మంది కార్మికులు ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను విస్మరించిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్ ఆరోపించారు. శతాబ్దకాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చి నాలుగు కార్మిక కోడ్‌లను తీసుకువచ్చిందన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన...