జూలైలో తిరుమలకు 24.52 లక్షల మంది భక్తులు
10.58 లక్షల మంది తలనీలాల సమర్పణ
జూలై 16న ఒక్కరోజే రూ.5.31 కోట్ల విరాళాలు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి జూలై నెలలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నెల మొత్తం 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.
భక్తులు హుండీ ద్వారా మొత్తం రూ.140.29 కోట్ల కానుకలను సమర్పించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఇందులో జూలై 16వ తేదీన ఒక్కరోజే రూ.5.31 కోట్ల హుండీ ఆదాయం నమోదై నెలలోనే అత్యధికంగా నిలిచింది.
అదేవిధంగా, మొక్కులు తీర్చుకునే క్రమంలో 10.58 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. జూలై నెలలో భక్తుల రద్దీ, హుండీ ఆదాయం, తలనీలాల సమర్పణ గణనీయంగా నమోదవడం తిరుమల క్షేత్రానికి భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});