మంత్రి వివేక్ అభివృద్ధి పనులు కేవలం ప్రచారానికే పరిమితం
పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సంజయ్ కుమార్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మందమర్రి మున్సిపాలిటీలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి వివేక్ చేస్తున్న ప్రచారం వాస్తవ పరిస్థితులకు విరుద్ధమని టీ-టిడిపి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సంజయ్ కుమార్ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఆదివారం నిర్వహించిన టీ-టిడిపి ప్రజా పోరు పాదయాత్రలో భాగంగా 15, 16 వార్డుల్లో గడపగడపకు వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా 15, 16 వార్డుల మహిళా కార్యకర్తలు సంజయ్ కుమార్‌కు హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రచార ఆర్భాటానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. శ్రీపతి నగర్, దీపక్ నగర్ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడం, డ్రైనేజీలు కూలిపోవడం, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. “కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు ఈ గల్లీల్లోని దుస్థితి కనిపించడం లేదా? ఇక్కడి ప్రజలు ఓట్లు వేయలేదా? మిమ్మల్ని గెలిపించలేదా?” అని సంజయ్ కుమార్ ప్రశ్నించారు.అయినా గ్రూప్ రాజకీయాలతో కొట్టుకుంటున్న కొందరు నాయకులకు, గ్రూపులు నడిపే పలువురి నాయకులకు అభివృద్ధి గురించి పట్టించుకునే సమయం ఎక్కడ ఉంటుందని సంజయ్ ఈ సందర్బంగ ఆరోపించారు. పార్టీలో నాయకులను అదుపులో పెట్టని మంత్రికి అభివృద్ధి పై అవగాహన ఎక్కడ ఉంటుందన్నారు.
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇప్పటికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించకుండా ప్రభుత్వం మభ్యపెడుతోందని ఆరోపించారు. వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని, లేనిపక్షంలో మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల పరిధిలో పాదయాత్రను మరింత ఉధృతం చేసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎం.డి. షరీఫా, పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, పట్టణ మహిళా అధ్యక్షురాలు జూపాక సంధ్య, పట్టణ ఉపాధ్యక్షుడు వడ్నాల సత్యనారాయణ, మండల అధ్యక్షురాలు బూనేని సుగుణ, మున్సిపల్ ఇన్‌చార్జ్ కోడివారి కవిత, బొబ్బర్ల భాగ్య, సువర్ణ, స్వప్న, జ్యోతి, విశాలాక్షి, ఉమా, అహల్య, రమా, రాజేష్, ప్రశాంత్‌తో పాటు వార్డుల ప్రజలు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});