CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 4:44 pm Posted By: coalbelt 24 News

బీబీపేటలో వైభవంగా మాంకాలమ్మ బోనాల జాతర

కులమత భేదాలకు అతీతంగా వేలాది మంది భక్తుల సందడి..
ఉదయం నుంచి కొనసాగిన బోనాలు, మొక్కులు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం మాంకాలమ్మ బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్‌లో జరిగే బోనాల ఉత్సవాల తరహాలోనే బీబీపేటలో కూడా ప్రతి సంవత్సరం ఈ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. వందలాది బోనాలు సమర్పించడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండి, పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాయి. మహిళలు, పురుషులు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామంలోని అతిపెద్ద పండుగగా పేరొందిన మాంకాలమ్మ జాతరను కులమత భేదాలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ ఐక్యంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది.

గ్రామ పెద్దలు, యువకులు, మహిళా సంఘాల ప్రతినిధులు కలిసి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించి విజయవంతంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఇదే విధంగా అమ్మవారి ఆశీస్సులతో జాతర వైభవంగా కొనసాగుతుండడం తమకు ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});