కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

వేగం పుంజుకున్న ప్రక్రియ ఆదివారం ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రుల కీలక సమావేశాలు క్షేత్రస్థాయి నుంచి ఆశావాహుల జాబితా సేకరణ సీఎం, టీపీసీసీ చీఫ్ ఆమోదంతో తుది జాబితా ప్రకటన కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు అధికారికంగా వేగం పుంజుకుంది. పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించేందుకు ప్రభుత్వం, పార్టీ నాయకత్వం సమన్వయంతో ముందుకు సాగుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్గదర్శకాలు, విధివిధానాలను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం...