మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత….
వేధింపులు సహించవద్దు.. వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి ఎస్‌ఐ హైమా కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట చర్యలు చేపడుతోందని మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ హైమా తెలిపారు. శనివారం మందమరిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో బాలికలకు నిర్వహించిన మహిళల భద్రత అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని ఆమె...