మందమర్రిలో ఐఎన్‌టీయూసీ మహాధర్నా…..
సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమాలు మణుగూరు డిప్‌సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలి ఐఎన్‌టీయూసీ సెంట్రల్ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెళ్లి సమ్మయ్య డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి పరిరక్షణ కోసం తమ యూనియన్ ఉద్యమాలు చేపడుతుందని ఐఎన్‌టీయూసీ సెంట్రల్ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెళ్లి సమ్మయ్య స్పష్టం చేశారు. శనివారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు.ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ కు వినతి పత్రం ఇచ్చిన అనంతం ఆయన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చిన...