సెప్టెంబర్ 14న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం
అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాహన సేవలు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందు రోజు అయిన సెప్టెంబర్ 14న అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
అనంతరం అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వివిధ వాహన సేవలు భక్తులకు దర్శనమివ్వనున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, టీటీడీ అన్ని ఏర్పాట్లు చేపడుతోంది. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});