బీబీపేట బ్రిడ్జిపై ప్రభుత్వ నిర్లక్ష్యం వీడకపోతే ఆందోళన
రాకపోకలకు ఏకైక మార్గమైన వంతెన ప్రమాదకర స్థితిలోనే. వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ప్రధాన వంతెన (బ్రిడ్జి) శిథిలావస్థకు చేరుకుని చాలా కాలం గడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఈ వంతెన బీబీపేట మండలానికి చెందిన తుజాల్పూర్, మల్కాపూర్, ఉప్పరపల్లి, ఈసానగర్, యాదారం,...