వారణాసి’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ..
పోస్ట్‌పోన్ పుకార్లకు ఫుల్‌స్టాప్
ఏప్రిల్ 7, 2027నే విడుదల..
250 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభించిన చిత్ర బృందం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
‘వారణాసి’ సినిమా విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు చిత్ర బృందం తెరదించింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుందని మరోసారి స్పష్టం చేసింది.
సినిమా విడుదలకు సరిగ్గా 250 రోజులు మాత్రమే మిగిలి ఉన్న సందర్భంగా చిత్ర బృందం శుక్రవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. “వారణాసి రిలీజ్‌కు ఇంకా 250 రోజులు.. 2027 ఏప్రిల్ 07” అంటూ పోస్టు చేసింది.
ఈ అధికారిక ప్రకటనతో సినిమా విడుదల వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పుకార్లకు పూర్తిగా తెరపడింది. చిత్ర బృందం చేసిన పోస్టుతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});