CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 1:22 pm Posted By: coalbelt 24 News

వెండి ధరకు మళ్లీ జోష్….

హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరం..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,450..
వెండి కిలో ధర రూ.2,25,349కు చేరిక

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): బంగారం ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగగా, వెండి ధరలో మాత్రం గణనీయమైన పెరుగుదల నమోదైంది. క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.1,47,450గా నమోదైంది. ఆభరణాల తయారీలో విస్తృతంగా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300గా కొనసాగుతోంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇక వెండి ధరలో పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,25,349గా నమోదైంది. గత ట్రేడింగ్‌లో రూ.2,23,575గా ఉన్న ధర ఒక్కరోజులోనే రూ.1,774 పెరిగి కొత్త స్థాయికి చేరుకుంది.

బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, వెండి ధర పెరగడం వల్ల ఆభరణాల కొనుగోలు, పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});