CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:15 pm Posted By: coalbelt 24 News

షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్ రష్మిక మందన్న

డ్యాన్స్ చిత్రీకరణలో ప్రమాదం
తుంటి భాగంలో గాయం
ఆరు వారాల విశ్రాంతి సూచించిన వైద్యులు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడినట్లు సమాచారం. చిత్రంలోని ఓ డ్యాన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జారి పడటంతో తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే చిత్రబృందం రష్మికను సమీప ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గాయం తీవ్రతను పరిశీలించిన అనంతరం పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.

ఈ ఘటనతో ప్రస్తుతం ఆమె పాల్గొనాల్సిన సినిమా షూటింగ్‌లు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. రష్మిక త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});