ఎడతెరిపి లేని వర్షాలతో సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
ఐదు ఉపరితల గనుల్లో ఉత్పత్తి నిలిచివేత ఒక్కరోజే సుమారు 29 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం గనుల్లోకి చేరిన వరద నీటిని తొలగించే పనుల్లో అధికారులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల ప్రభావంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో బుధవారం...