శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆంక్షలు

విమానాల భద్రత దృష్ట్యా పోలీసుల హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీజే లైటింగ్, స్కైబీమ్‌లు, సెర్చ్ లైట్ల వల్ల పైలెట్లకు ఇబ్బందులు ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచన కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో అధిక తీవ్రత కలిగిన లేజర్ బీమ్‌లు, స్కైబీమ్‌లు, సెర్చ్ లైట్లు, డీజే లైటింగ్ వినియోగంపై అధికారులు ఆంక్షలు విధించారు. విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని...