CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 11:17 pm Posted by : coalbelt 24 News

శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆంక్షలు

విమానాల భద్రత దృష్ట్యా పోలీసుల హెచ్చరిక..
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
డీజే లైటింగ్, స్కైబీమ్‌లు, సెర్చ్ లైట్ల వల్ల పైలెట్లకు ఇబ్బందులు
ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచన

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో అధిక తీవ్రత కలిగిన లేజర్ బీమ్‌లు, స్కైబీమ్‌లు, సెర్చ్ లైట్లు, డీజే లైటింగ్ వినియోగంపై అధికారులు ఆంక్షలు విధించారు. విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇటీవల వివాహ వేడుకలు, ఫంక్షన్లు, ఇతర భారీ కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్న లేజర్ లైట్లు, స్కై లైట్లు నేరుగా ఆకాశం వైపు ప్రసరించడం వల్ల విమానాలను నడిపే పైలెట్ల దృష్టి మరలే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఈ తరహా లైట్లు తీవ్రమైన ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో శంషాబాద్ పోలీసులు, విమానాశ్రయ అధికారులు కలిసి ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ నిర్వాహకులు, డెకరేటర్లు, డీజే నిర్వాహకులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విమానాల భద్రతకు భంగం కలిగించే విధంగా లేజర్ బీమ్‌లు, స్కైబీమ్‌లు, సెర్చ్ లైట్లు వినియోగించరాదని స్పష్టం చేశారు.

అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. విమాన ప్రయాణ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు మరియు ఈవెంట్ నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

 

 

 

 

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});