మరోసారి తెరపైకి ఫార్ములా-ఈ కేసు..

రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరు ఏసీబీ నమోదు చేసిన కేసులో విచారణ వేగం కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): ఫార్ములా-ఈ కార్‌రేస్‌కు సంబంధించిన కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రేపు (శుక్రవారం) హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరుకానున్నారు. ఫార్ములా-ఈ కార్‌రేస్ నిర్వహణలో నిధుల బదిలీ, పరిపాలనా అనుమతులు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఈ...