తెలంగాణ కాంగ్రెస్‌లో డీసీసీ మార్పులు.. నల్గొండపై అందరి చూపు!
పున్నా కైలాష్ నేత భవితవ్యంపై ఉత్కంఠ – కోమటిరెడ్డి వర్గం వర్సెస్ రేవంత్ వర్గం? బీసీ సమీకరణాలపై కాంగ్రెస్‌కు కొత్త సవాల్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల మార్పు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఇద్దరు డీసీసీ అధ్యక్షులను మార్చనున్నారనే ప్రచారం పార్టీలో వర్గపోరుకు మరింత ఊతమిచ్చింది. ఈ పరిణామాల్లో నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పేరు ప్రధానంగా వినిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నల్గొండ...