అధికారుల ఆలస్యంతో బీబీపెట్ గ్రామసభ ఆలస్యం
సమయపాలన పాటించాలని ప్రజాప్రతినిధుల సూచన బీబీపెట్ గ్రామపంచాయతీలో 'జలసిరి' కార్యక్రమం కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపెట్ గ్రామపంచాయతీలో గురువారం "జలసిరి" కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. అయితే గ్రామసభ ప్రారంభ సమయానికి సంబంధిత అధికారులు హాజరుకాకపోవడంతో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కొంతసేపు వేచి చూడాల్సి వచ్చింది. అధికారులు ఆలస్యంగా చేరుకోవడంతో గ్రామసభ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. అధికారులు సమయానికి హాజరుకాకపోవడంపై గ్రామ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభల వంటి ప్రజలకు అత్యంత ముఖ్యమైన సమావేశాలకు అధికారులు సమయపాలన...