శ్రీవారి దర్శనంపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు..
ప్రైవేటు సంస్థలకు అలాంటి హామీలు ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసిన టీటీడీ
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనాన్ని వ్యాపార ప్రచారం కోసం ఉపయోగిస్తూ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసిన రీల్ తీవ్ర చర్చకు దారితీసింది. “మా ప్రాజెక్టులో ప్లాట్ కొనుగోలు చేసే ప్రతి కొనుగోలుదారుకు జీవితాంతం ఉచితంగా శ్రీవారి వీవీఐపీ దర్శనం టికెట్ పాస్ అందిస్తాం” అంటూ ఆ సంస్థ ప్రచారం చేయడం భక్తుల్లో ఆందోళన కలిగించింది.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెంటనే స్పందించింది. తిరుపతి హైవే సమీపంలోని తమ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేస్తే “జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం” అంటూ ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారానికి టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
శ్రీవారి దర్శనాలకు సంబంధించిన హామీలు ఇవ్వడానికి ఏ ప్రైవేటు సంస్థకు గానీ, వ్యక్తికి గానీ ఎలాంటి అధికారం లేదని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని సూచించారు.వ్యాపార ప్రయోజనాల కోసం శ్రీవారి పేరును, దర్శన వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం తీవ్రంగా ఖండనీయమని టీటీడీ తెలిపింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});