స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఊరట
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): దేశీయ బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న విలువైన లోహాల ధరలు తాజాగా కాస్త దిగివచ్చాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి కొంత ఊరట లభించింది. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ తాజా వివరాల ప్రకారం, హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.1,46,610గా నమోదైంది. గత ట్రేడింగ్ సెషన్‌లో ఇది రూ.1,47,190గా ఉండగా, ఒక్కరోజులోనే రూ.580 తగ్గింది. ఆభరణాల తయారీలో విస్తృతంగా...