CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 9:44 pm Posted by : coalbelt 24 News

గ్రామ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి

బీబీపేట్ ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం
హాజరైన సర్పంచులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీవో నరేష్, సొసైటీ డైరెక్టర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

అదేవిధంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, వాటి వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. రైతులు ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని కోరారు. గ్రామాల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులు సూచించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});