హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ప్రభుత్వం అండ.. ?
సుప్రీంకోర్టు దాకా వెళ్లేందుకు సిద్ధం? హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు సన్నాహాలు.. అవసరమైతే ఆర్టికల్-136 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచన.. హైడ్రా దూకుడు కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యంగా చర్చ కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా (HYDRAA) వ్యవహారంలో కమిషనర్ ఐఏఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, బడా రియల్ ఎస్టేట్ మాఫియాపై హైడ్రా చేపట్టిన చర్యల్లో రంగనాథ్ కీలక...