రామ్ చరణ్‌కు శస్త్రచికిత్స
'పెద్ది' షూటింగ్‌లో గాయంతో ఆపరేషన్. ఎనిమిది వారాలు విశ్రాంతి అనంతరం ఫిజియోథెరపీ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు శుక్రవారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న గంగా ఆస్పత్రిలో మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా ఆపరేషన్ పూర్తయిందని వైద్యులు వెల్లడించారు. పూర్తిగా కోలుకోవడానికి ఎనిమిది వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, అనంతరం ఫిజియోథెరపీ ప్రారంభించాలని సూచించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ ఎస్. రాజశేఖరన్ పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స నిర్వహించగా, అమెరికాలోని మియామికి చెందిన ప్రపంచ...