‘పెద్ది’ షూటింగ్‌లో గాయంతో ఆపరేషన్.
ఎనిమిది వారాలు విశ్రాంతి
అనంతరం ఫిజియోథెరపీ
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు శుక్రవారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న గంగా ఆస్పత్రిలో మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా ఆపరేషన్ పూర్తయిందని వైద్యులు వెల్లడించారు. పూర్తిగా కోలుకోవడానికి ఎనిమిది వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, అనంతరం ఫిజియోథెరపీ ప్రారంభించాలని సూచించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ ఎస్. రాజశేఖరన్ పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స నిర్వహించగా, అమెరికాలోని మియామికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత మణికట్టు నిపుణుడు డాక్టర్ అలెజాండ్రో బాడియా కూడా వైద్య బృందంలో పాల్గొన్నారు.
గాయం క్లిష్టమైనదిగా ఉండటంతో ప్రత్యేక నిపుణుల సహకారంతో శస్త్రచికిత్స చేపట్టినట్లు సమాచారం. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సందర్భంగా రెజ్లింగ్ సన్నివేశాల చిత్రీకరణలో రామ్ చరణ్ మణికట్టుకు గాయమైనట్లు తెలిసింది. షూటింగ్‌కు అంతరాయం కలగకుండా కొంతకాలం నొప్పిని భరిస్తూ చిత్రీకరణ పూర్తి చేసిన ఆయన, వైద్యుల సూచన మేరకు గాయం మరింత తీవ్రం కాకముందే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ‘పెద్ది’ విడుదల అనంతరం ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న రామ్ చరణ్, పూర్తిగా కోలుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్న పాన్ ఇండియా చిత్రంలో పాల్గొననున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య బృందం స్పష్టం చేసింది. మరోవైపు, ఆయన త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆకాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});