రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి

రైతు వేదికల ద్వారా కంది, పెసర విత్తనాల పంపిణీ వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రైతు వేదికల ద్వారా కంది, పెసర విత్తనాలను అందజేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఈ. సురేఖ తెలిపారు. మందమర్రి మండలంలోని సెంట్రోన్‌పల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన "రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు" కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై...