తిరుమల శ్రీవారి పుష్కరిణి విశిష్టత ఇదే

సకల తీర్థాల సంగమంగా ప్రసిద్ధి.. పుష్కరిణిలో స్నానంతో పాప విమోచనం పొందుతారని భక్తుల విశ్వాసం కోల్ బెల్ట్ న్యూస్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించడంతో పాటు ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్న పవిత్రమైన శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా భక్తులు భావిస్తారు. సాంప్రదాయం ప్రకారం భక్తులు ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి, అనంతరం శ్రీ వరాహస్వామిని...