విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
అమృత్ భారత్ పథకంతో మహా రూపాంతరం రూ.714.73 కోట్లతో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు 2027 ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి స్టేషన్ కోల్ బెల్ట్ న్యూస్(సికింద్రాబాద్): దేశంలోనే అత్యాధునిక రైల్వే స్టేషన్లలో ఒకటిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.714.73 కోట్ల అంచనా వ్యయంతో జరుగుతున్న పునరాభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. విమానాశ్రయాలను తలపించేలా అత్యాధునిక సౌకర్యాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్...